గోపిచంద్ రెమ్యునరేషన్.. మాస్ హీరోల్లోనే అతి తక్కువ!


ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ వర్గం హీరోలు సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం సక్సెస్ అందుకునేవారు. కాస్త మాస్ ఎలివేషన్స్ ఉన్నా కూడా సినిమాలకు ఏమాత్రం నష్టం వచ్చేది కాదు. కానీ ఈ రోజుల్లో కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్ల వరకు వస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తే మెగాస్టార్ అయినా సరే డిజాస్టర్లు చూడక తప్పడం లేదు.

ఇక ఎప్పటినుంచో మాస్ హీరోగా గుర్తింపు అందుకుంటూ వస్తున్న గోపీచంద్ కూడా ఈ మధ్యకాలంలో వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు గోపీచంద్ సినిమాలు వస్తున్నాయి అంటే మాస్ సెంటర్లలో అయితే చాలా సందడిగా కనిపించేది. మినిమం థియేటర్స్ మొదటి వీకెండ్ అయితే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనం ఇచ్చేవి. కానీ ఇప్పుడు అతని వరుస డిజాస్టర్స్ కారణంగా మార్కెట్ చాలా వరకు తగ్గిపోయింది.

ముఖ్యంగా రామబాణం కోలుకోలేని దెబ్బ కొట్టింది. 30 కోట్ల ఖర్చుతో తీసిన సినిమాకు సగంలో సగం కూడా వెనక్కి రాలేకపోయింది. కనీసం ఓటిటి రైట్స్ కూడా చెప్పుకోదగిన రేటుకు అమ్ముడుపోలేదు. అయితే ఇప్పుడు శ్రీను వైట్లతో చేస్తున్న సినిమాకు మాత్రం గోపీచంద్ చాలా తక్కువ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టైర్ టు హీరోల తరహాలోనే మొన్నటి వరకు కొనసాగిన గోపీచంద్ ఇప్పుడు అంతకంటే తక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ ఒక్కసారిగా రెండు కోట్లకు పడిపోయింది.

గతంలో అతను 5 నుంచి 7 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు మార్కెట్ చాలా తగ్గడంతో శ్రీను వైట్ల సినిమాకు తక్కువ స్థాయిలో తీసుకోవాల్సి వస్తుంది. ఒక విధంగా మాస్ హీరోల్లోనే ఇది చాలా తక్కువ రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు. మరి శ్రీను వైట్ల ప్రాజెక్ట్ తో అయినా అతను మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post