ఎన్టీఆర్ రాజమౌళిని రిజెక్ట్ చేశాడా?


జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో డౌన్ అయిన ప్రతిసారి కూడా బిగ్గెస్ట్ సక్సెస్ చూసింది మాత్రం ఎక్కువగా రాజమౌళి దర్శకత్వంలోనే. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక RRR సినిమా అంతకుమించి అనేలా సక్సెస్ అయ్యింది. అయితే అందులో ఎన్టీఆర్ పాత్రను బలంగానే చూపించినప్పటికీ చరణ్ పాత్ర కంటే కాస్త తక్కువ స్థాయిలో ఉంది అన్నట్టుగా కామెంట్స్ అయితే వినిపించాయి.

అయితే RRR సీక్వెల్ ఉంటుంది అని గతంలో క్లారిటీ ఇచ్చారు. ఇక రాజమౌళి రీసెంట్ గా మళ్లీ ఆ ఐడియాను తన తండ్రి విజయేంద్రప్రసాద్ చేత డెవలప్ చేయించారు అని కొంత వరకు కథ కూడా సిద్ధమైనట్లుగా టాక్ అయితే వినిపించింది. అయితే రీసెంట్గా ఆ విషయాన్ని రాజమౌళి రామ్ చరణ్ కు చెప్పగా అతను ఓకే చెప్పాడు అని, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒప్పుకోలేదు అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి.

కానీ ఇందులో అయితే ఇలాంటి నిజం లేదు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి తన ఫోకస్ మొత్తం కూడా మహేష్ బాబు ప్రాజెక్ట్ పైన పెట్టాడు. త్వరలోనే ఆ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ముందుగా వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేయనున్నారు. కాబట్టి ఈ బిజీలో రాజమౌళికి RRR సీక్వెల్ పై కూర్చునేంత సమయం అసలు లేదు. కాబట్టి అలా వస్తున్న వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదు.

Post a Comment

Previous Post Next Post