ఊరు పేరు భైరవకోన - రివ్యూ & రేటింగ్


కథ:

భయంకరమైన సంఘటనలకు అడ్డాగా మారిన భైరవకోన లోకే బసవ( సందీప్ కిషన్) - స్నేహితుడు జాన్ ( వైవా హర్ష) ఊహించిన విధంగా ఒక దొంగతనం చేసి ఆ ఊర్లోకి అడుగు పెడతారు. వారితో పాటు గీత ( కావ్య థాపర్) కూడా అక్కడికి రావాల్సి వస్తుంది. అనంతరం వారు ముగ్గురు కూడా వింత అనుభవాలను భయానక పరిస్థితులను ఎదుర్కొంటారు.  భైరవకోనలో కొన్ని సంఘటనలు భయానకంగా ఉంటాయి. అయితే అసలు ఆ భైరవకోనలో అసలు ఏం జరుగుతుంది? ఆ ఊరు అలా ఉండడానికి కారణం ఏంటి? గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలకు ఈ గ్రామానికి సంబంధం ఏంటి అనే అంశాలు సినిమాలో ఆసక్తిని కలిగిస్తాయి. ఇక హీరో ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు? తన ప్రేయసి కోసం ఎలాంటి సాహసం చేశాడు అనేది సినిమాలోని మిగతా కథ.


విశ్లేషణ:
దర్శకుడు VI ఆనంద్ ఇదివరకే కొన్ని డిఫరెంట్ ప్రయోగాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక ఈసారి అతను కాస్త హారర్ మిస్టరీ టచ్ ఇచ్చి దానికి ఫాంటసీ కథను జోడించి ఊరు పేరు భైరవకోన అనే సినిమాను తెరపైకి తీసుకోవచ్చాడు. ఈ కథ విషయంలో దర్శకుడు ఫన్నీ వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలి అని స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మొదట్లోనే అనిపిస్తూ ఉంటుంది. ప్రేక్షకుడిది పెద్దగా టెన్షన్ పెట్టకుండా కథలోకి తీసుకువెళ్లగలిగాడు. ఫస్ట్ ఆఫ్ సరదాగా కామెడీ సన్నివేశాలతో కొనసాగుతూనే మరొకవైపు కాస్త హారర్ టచ్ లో మ్యాజిక్ క్రియేట్ చేశారు. 

ప్రతి సీన్ తో తరువాత ఏం జరుగుతుందో అనేలా దర్శకుడు ఆడియెన్స్ ను కథకు కనెక్ట్ అయ్యేలా చేసుకున్నాడు. ఇక హీరో హీరోయిన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా డిఫరెంట్ థ్రిల్ లో ఎంటర్టైన్ చేయాలని గట్టిగానే ప్రయత్నం చేశాడు. ఇక అక్కడక్కడా కొన్ని సీన్స్ కొంత లాజిక్ కు సంబంధం లేకుండా ఉందని అనిపించినా ఎంటర్టైన్మెంట్ మూడ్ లో అది ఎక్కువగా మైనస్ అవ్వదు. వీలైనంత వరకు దర్శకుడు తన స్క్రీన్ ప్లే ప్లస్ విజువల్స్ తో థ్రిల్ అయ్యేలా చూపించారు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచుతుంది. 

కానీ సెకండ్ ఆఫ్ లో ఇంకాస్త ఎక్కువ స్టఫ్ ఇవ్వాల్సింది. పాత్రలకు పెద్దగా ఛాలెంజ్ లేకుండానే పరిస్థితులు అనుకూలంగా మారడం వల్ల పెద్దగా ఇంట్రెస్ట్ కలగదు. కానీ దర్శకుడు అనుకున్న కథను అయితే చాలా క్లారిటీగా చెప్పగలిగే ప్రయత్నం చేశాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు సినిమా కనెక్ట్ అవుతుంది కానీ అక్కడక్కడా కొన్ని దెయ్యాల కాన్సెప్ట్ లు ఎక్కువ మోతాదులో ఉండడం వలన ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చెప్పడం కష్టం. అంతే కాకుండా ఏమోషన్ ఇంకా బాగా క్లిక్కయ్యి ఉంటే మరింత బలం చేకూరేది. 

నటుడిగా సందీప్ కిషన్ తన పాత్రకు పర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. ఎంత కావాలో అంతే ఇచ్చాడు. అతని నుంచి డిఫరెంట్ కథలను వస్తాయని నమ్మకం పెట్టుకున్న ఆడియెన్స్ ను నిరశపరచలేదు. అలాగే ఈ కథలో మంచి టైమింగ్ తో ఒకవైపు కామెడీ మరోవైపు ప్రేమను చూపిస్తూ మిస్టరీ సీన్స్ లో కూడా ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా నటించాడు. మొత్తానికి వైరవకొన తో సందీప్ మరో హిట్ కొట్టాడు అని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ వర్ష క్యారెక్టర్ పరవాలేదు. వైవా హర్ష, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ కామెడీతో గట్టిగానే నవ్వించారు. సెకండ్ హాఫ్ అలాగే క్లయిమాక్స్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కెమెరా పనితనం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. ఇక ఆర్ట్ వర్క్ ఇలాంటి సినిమాలకు చాలా ముఖ్యం. సెకండ్ హాఫ్ లో కొన్నీ లోపాలు ఉన్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ కు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఇక చాలా రోజుల తరువాత ఇలాంటి సినిమా రావడం వలన బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించే అవకాశం ఉంది.  

ప్లస్ పాయింట్స్:
👉మొదటి భాగం
👉హీరో క్యారెక్టర్
👉కామెడీ సీన్స్
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
👉సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
👉రొటీన్ క్లైమాక్స్

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post