రాజమౌళి, మహేష్.. డబ్బుల మ్యాటర్ లో ఎవరు తగ్గట్లే..

 


రాజమౌళి ఏ సినిమా చేసిన కూడా అందులో హీరోలకు మాత్రం ముందుగానే ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి ఉంటుంది. రాజమౌళి మాత్రం నిర్మాతతో పాటే సక్సెస్ లో షేర్ అందుకునే విధంగా డీల్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఒక విధంగా ఈ తరహా నిర్ణయం నిర్మాతలకు మేలు చేసేదే. ఇక రాజమౌళి బయటపడక పోయినప్పటికీ కూడా ఇలాంటి తేడాలు రాకుండా బిజినెస్ విషయంలో మాత్రం చాలా చక్కగా ఆలోచిస్తూ ఉంటాడు.


పెట్టిన ప్రతి రూపాయి కూడా సినిమాకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది. అందుకే నిర్మాతలు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్న కూడా పెద్దగా ఎదురు చెప్పరు. ఇక మహేష్ బాబు కూడా చాలా కాలంగా తన ప్రతి సినిమాకు సక్సెస్ లో వాటా అందుకుంటూ వస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమా విషయంలో ఈసారి మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోవచ్చు అనే విధంగా టాక్ వచ్చింది.

కానీ ఏమైందో ఏమో కానీ మహేష్ కూడా రాజమౌళితో పాటు సక్సెస్ లో షేర్ అందుకునే విధంగా మాట్లాడుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో పెద్దగా అభిప్రాయ బేధాలు రాకుండానే నిర్మాత తో మాట్లాడి డీల్ ఫైనల్ చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమా కోసం దాదాపు 1000 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా బిజినెస్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతోంది. మరి రాజమౌళి మహేష్ షేర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post