హిట్టు సినిమాకి సీక్వెల్.. దిల్ రాజు సొంత కథ

 


నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఎంతగా సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన నిర్మించే సినిమాలలో కూడా ఎంతో కొంత తన ఐడియాలు ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్త దర్శకులతో చేసినప్పుడు ఆయన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడానికి కూడా ఆయన ఐడియాలే కారణం. కొన్నిసార్లు తేడా వచ్చినప్పటికీ మేజర్ గా మాత్రం బిగ్ సక్సెస్ లు చూసింది దిల్ రాజు ఐడియాలతోనే. అంతగా ఒక కథపై అంచనా వేయగలరు.


ఇక దిల్ రాజుకి చిన్న సినిమాలలో ఎక్కువగా లాభాలు అందించిన వాటిలో శతమానం భవతి కూడా ఉంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథలో దిల్ రాజు ఐడియాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈసారి ఆ సినిమాకు సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్నారు.  దానికి ఈసారి ఎక్కువ భాగం కథను దిల్ రాజు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దిల్ రాజు కాంపౌండ్ లో ఎప్పటినుంచో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న హరి అనే దర్శకుడు ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తాడు అని సమాచారం. ఈసారి దిల్ రాజు ఒరిజినల్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వడం లేదట. ఇక ఈ సినిమా కూడా సంక్రాంతికి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పటికే దిల్ రాజు వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతికి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండిటిలో  ఏదైనా ఒకటే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. మరి దిల్ రాజు ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post