రాజమౌళి - మహేష్.. అసలు ఏం జరుగుతోంది..?


మహేష్ బాబు రాజమౌళితో కొత్త ప్రాజెక్టును ఎప్పుడు మొదలు పెడతాడా అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు మొదలవడానికి ఇంకా ఎక్కువ సమయమే పట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే రాజమౌళి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ మొదలైన తర్వాత కొంత టెస్ట్ షూట్ కూడా చేసే అవకాశం ఉంది. తన ప్రతి సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ తో పాటు సన్నివేశాలపై ముందుగానే ఒక క్లారిటీకి రావడానికి టెస్ట్ షూట్ చేసిన సందర్భాలు చాలా ఎక్కువే.

రీసెంట్ గా బాహుబలి టెస్ట్ షూట్ వీడియోలు గట్టిగానే వైరల్ అయ్యాయి. కొన్ని సీన్స్ కు ముందుగా కీరవాణి అడ్వాన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సన్నివేశానికి తగ్గట్టుగా రైటర్స్ తో డైలాగ్స్ సెట్ అయిన తర్వాత ఒక వర్క్ షాప్ నిర్వహించి ఆ తర్వాత టెస్ట్ షూట్ చేస్తారు. బాహుబలి RRR లకు ఇదే ఫాలో అయిన జక్కన్న మహేష్ బాబు సినిమా కోసం అయితే ఇంకా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్టును దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందించనున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళికి నచ్చే విధంగా తన లుక్కును అయితే మార్చుకుంటూ ఉన్నాడు. ఒకవైపు ఫిట్నెస్ తో పాటు మరొకవైపు లాంగ్ హెయిర్ ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా మహేష్ తన కూతురితో దిగిన ఫోటోలో మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపించాడు. మహేష్ లుక్కు ఫైనల్ అయిన తర్వాత ఫొటో షూట్ కూడా ఉంటుంది. ఆ తరువాత టెస్ట్ షూట్, ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ అంతా సెట్టయితే గాని అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాదు. ఫైనల్ గా సమ్మర్ తర్వాతనే ప్రాజెక్టు గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post