కథ:
హీరో లంకల రత్న(విశ్వక్ సేన్) భవిష్యత్తు గురించి అలచించి తన గ్యాంగ్ తో మరో స్థాయికి చేరాలని అనుకుంటాడు. లోకల్ ఎంఎల్ఏ రుద్రరాజు (గోపరాజు రమణ) తో చేరి తన బలాన్ని చూపించుకోవలని అనుకుంటాడు. ఇక ఆ తరువాత అతనికే ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. హత్య రాజకీయాలు అతని ఫ్యామిలీని కూడా సమస్యల్లో పెడతాయి. ప్రాణంగా ప్రేమించే భార్య(బుజ్జి)కి కూడా ప్రేమదంలో ఉందని తెలుసుకున్న రత్న మరో నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఈ పరిస్థితులలో రత్న ఏం చేస్తాడు? అతన్ని శత్రువులు ఇంకా ఏ విధంగా టార్గెట్ చేస్తారు? సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు అనేది తెలియాలి అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తన నటనతో బాగానే మెప్పించాడు. లంకల రత్న పాత్రలో కనిపించిన ఆయన తన క్యారెక్టర్‌లో ఉన్న గ్రే షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు. ఒక సాధారణ యువకుడు, రాజకీయ నాయకులకు ఎదురు నిలిచి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగే కథా నేపథ్యం పరవాలేదు అనిపిస్తుంది. హీరో లుంగీ కట్టులో, కత్తి పట్టుకొని ఉండడం ఓ వర్గం ప్రేక్షకులకు బాగానే నచ్చుతుంది.
క్యారెక్టర్ విషయంలో విశ్వక్ ఎంత చేయాలో అంత చేశాడు. కానీ డైరెక్టర్ కృష్ణ చైతన్య మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ పరవాలేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చే సరికి ఇంపాక్ట్ చూపించేంత స్టఫ్ ఏమి లేదు. డైలాగ్స్ పరవాలేదు. ఇక యాక్షన్ ఘట్టాలు కొట్లాటలు కొంత వరకు మాస్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతాయి. కానీ అసలైన ఏమోషన్ సెకండ్ హాఫ్ లో క్లిక్ కాలేదు.
అంజలి పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించేంతలా కనిపించలేదు. దర్శకుడు దాదాపు మొత్తం కథను ఫస్ట్ హాఫ్ లోనే హైలెట్ చేశాడు. దీంతో సెకండ్ హాఫ్ లో అంతకుమించి ఏమైనా చూపిస్తాడేమో అనే భావన కలుగుతుంది. ఇక రెండవ భాగం ఆశించినస్థాయిలో క్లిక్ కాలేదు. ఇక సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా మధ్యలో చిరాకు తెప్పిస్తున్నట్లు ఉంటాయి. ఆ విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్తగా డీల్ చేయాల్సింది.
ఇక హీరోయిన్ నేహా శెట్టి క్యారెక్టర్ అంత కొత్తగా ఏమి లేదు. ఇక ఇతర నటీనటులు వారి పరిధి మేరకు బాగానే నటించాడు. ఇక కెమెరా పనితనం ఆర్ట్ వర్క్ గోదావరి బ్రౌన్ లొకేషన్స్ సినిమాను కొంత కలర్ఫుల్ గా మార్చాయి. ఇక యువన్ శంకర్ రాజా పనితనం పరవాలేదు. ఫైనల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో దర్శకుడు లోకల్ ఫ్లేవర్ ను పర్ఫెక్ట్ గా చూపించాలి అనుకున్నాడో ఏమో గాని.. ఆ సీన్స్ అన్ని వర్గాల ఆడియెన్స్ కు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పొలిటికల్ గొడవలు ఈ రోజుల్లో వెండితెరపై మళ్ళీ క్లిక్కయ్యేలా చేయడం అంత ఈజీ కాదు. ఏదో మ్యాజిక్ క్రియేట్ అవ్వాలి. దర్శకుడు స్టోరీ, బ్యాక్ డ్రాప్ దగ్గరే రిస్క్ తీసుకున్నాడు. ఇక బిగ్ స్క్రీన్ పై వచ్చేసరికి అన్ని కుదరలేదు అనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ తప్పితే సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు పెద్దగా లేవు. మరి సినిమా ఈ సమ్మర్ ముగింపులో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
👉హీరో క్యారెక్టర్
👉ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్:
👉సెకండ్ హాఫ్
👉ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్
👉స్క్రీన్ ప్లే
👉ఏమోషన్ మిస్సయ్యింది
రేటింగ్: 2.25/5
Follow
Follow
Post a Comment