సుకుమార్ - చరణ్ కాంబో.. వచ్చేది ఎప్పుడు?

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో ఆ తర్వాత వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. అయితే రంగస్థలం కాంబినేషన్ గురించి చాలా రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.


ఈ కాంబినేషన్ పై రెండేళ్ల క్రితమే క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపించిన టాక్ ప్రకారం ఒక ఆసక్తికరమైన లీక్ అందింది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సెకండ్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రాబోతోంది.

ఇక 2024 చివరిలోనే రామ్ చరణ్ ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బుచ్చిబాబు RC16 కోసం ఒక 9 నెలల టైమ్ అయితే తీసుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం అన్ని జరిగితే తొందరగానే స్టార్ట్ కావచ్చు. ఇక ఇప్పటికే రామ్ చరణ్ సుక్కు RC17 కథకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫైనల్ స్క్రిప్ట్ అయితే కొంత పూర్తి చేయాల్సి ఉంది. ఇక సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరలోనే మొదలవుతుంది అంటే సినిమా బిగ్ స్క్రీన్ పైకి రావడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. అంటే ఈ కాంబినేషన్ ను తెరపై చూడాలి అంటే 2026 వరకు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post