నాని - శ్రీకాంత్.. బడ్జెట్ తో షాక్ ఇస్తున్నారుగా..


టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు. దసరా, హాయ్ నాన్న వంటి చిత్రాలు సూపర్ హిట్ అవడంతో నాని మంచి జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సరిపోదా శనివారం చిత్రంపై దృష్టి పెట్టారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అయితే, నాని తర్వాత సుజిత్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చినప్పటికీ, నిర్మాత డీవీవీ దానయ్య బడ్జెట్ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి మరికొందరు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని సమాచారం.


ఇక దసరా సినిమాతో మంచి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు నాని మరో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నాని కెరీర్‌లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ ఎల్‌ వీ సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీలో నాని కొత్త లుక్‌లో కనిపించనున్నారు. టెక్నీషియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రంతో నాని ఏ స్థాయి హిట్ కొడతారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post