అఖిల్ కోసం మరో ప్రాజెక్ట్ సెట్ చేసిన నాగార్జున


సినీ రంగంలో అక్కినేని వారసుడిగా నిలుస్తున్న అఖిల్ ప్రస్తుతం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయిన అఖిల్, తన తాజా ప్రాజెక్ట్‌లతో విజయాన్ని సాధించాలని ఆశపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన ప్రాజెక్ట్‌ల గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, అఖిల్ తన కొత్త లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. 


గుబురు గడ్డం, కోర మీసాలు, పొడవాటి జుట్టుతో స్టైలిష్‌గా కనిపించిన ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ కొత్త లుక్ వెనుక అఖిల్ తన తదుపరి సినిమాల కోసం మేకోవర్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 'ధీర' అనే సినిమాను అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అలాగే అఖిల్ మరో ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు నాగార్జున పర్యవేక్షణలో పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో విలేజ్ డ్రామాగా తెరకెక్కనుందని, 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

నాగార్జున ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించాలని నిర్ణయించుకున్నారట. నాగార్జున అఖిల్ విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న డిమాండ్. ఇక ఇప్పుడు నాగ్ చాలా సీరియస్ గానే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 

Post a Comment

Previous Post Next Post