ప్రభాస్ స్పిరిట్ లో ఆ నటుడు.. నిజమెంత?


ప్రభాస్ అభిమానులకు ప్రస్తుతం మరో బిగ్ ట్రీట్ రెడీ అవుతోంది. ఆయన కల్కి 2898ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫ్యాన్స్ ని సంతోషపరిచారు. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం సీరియస్ గా ప్లానింగ్ లో ఉన్నారు.


ఈ స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. టి-సిరీస్ మరియు భద్రకాళీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.

అయితే.. మూవీ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండేలా, ప్రభాస్ కి ప్రతినాయకుడిగా హాలీవుడ్ లో రాణిస్తున్న సౌత్ కొరియన్ యాక్టర్ ని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓ కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. ట్రైన్ టూ బూసాన్ మరియు మార్వెల్ సిరీస్ ఎటర్నల్స్ మూవీస్ లో నటించిన లీ డాంగ్ సిక్ ని సంప్రదిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన ఈ ప్రాజెక్ట్ కి అంగీకరిస్తే, స్పిరిట్ మూవీ రేంజ్ అమాంతం పెరిగిపోతుందని కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఇక ఇది ఎంతవరకు నిజం అనే వివరాల్లోకి వెళితే.. ఇంకా దర్శకుడు క్యాస్టింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ యాక్టర్ ని సంప్రదించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం అయితే లేదు. కానీ సందీప్ బిగ్ స్టార్స్ ను ఈ సినిమా కోసం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారు. ఒక లుక్ ఫుల్ మాస్ రఫ్ అండ్ రగ్గడ్ గా ఉండగా, మరో లుక్ సూపర్ స్టైలిష్ అవతార్ లో ఉండబోతుంది.

Post a Comment

Previous Post Next Post