కల్కి.. కోటి తీసుకునే వాళ్ళు కూడా ఫ్రీగా నటించారు!


 కల్కి 2898 AD సినిమాలో గతంలో ఇప్పుడు లేనంతగా గెస్ట్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ అయితే ఇచ్చాయి అని చెప్పవచ్చు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచించిన విధానం. సినిమాకు అన్ని రకాలుగా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. అసలు ఇంతమంది గెస్ట్ పాత్రలో అవసరమా అని విడుదలకు ముందు చాలా రకాల కామెంట్స్ వినిపించాయి. కానీ అతను తనకు క్లోజ్ గా ఉండే ఆర్టిస్టులు అందరినీ కూడా సినిమా కోసం వాడుకున్న విధానం బాగా వర్కౌట్ అయ్యింది.


అసలే సినిమాకు 600 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేశారు. ఇక క్యాస్ట్ విషయంలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశాపటాని లాంటి వాళ్ళకి భారీ స్థాయిలో పారితోషకాలు లభించాయి. అయితే గెస్ట్ పాత్రలలో నటించిన వారు చాలామంది అసలు ఎలాంటి పేమెంట్ తీసుకోలేదని తెలుస్తోంది. ఇక  కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్  మృణాల్ ఠాగూర్ కూడా ఈ సినిమాల్లో ఫ్రీగానే నటించిందట. ఆమె రెమ్యునరేషన్ కోటి కంటే ఎక్కువే. కానీ రూపాయి కూడా తీసుకోలేదట. మిగతా గెస్ట్ రోల్స్ కంటే ఆమె కాస్త ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ చేసింది.

ఇక ఆమె ఫ్రీగా చేయడానికి కారణం.. వైజయంతి మూవీస్ లో ఆమె సీతారామం సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే ఆమెకు సౌత్లో మంచి గుర్తింపు లభించింది. ఆ కృతజ్ఞతతోనే ఆమె కల్కి లాంటి పెద్ద సినిమాలో పేమెంట్ లేకుండా డేట్స్ ఇచ్చింది. ఇక అనిరుద్ సాంగ్ లో అలా వచ్చి వెళ్లినా అతని ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అతనికి మొదటి లైఫ్ ఇచ్చింది దర్శకుడు నాగ్ అశ్విన్. జాతి రత్నాలు  వాళ్ళ కాంపౌండ్ లోనే రూపొందిన విషయం తెలిసిందే.

ఇక దుల్కర్, విజయ్ దేవరకొండకు మాత్రం డైలీ పేమెంట్స్ కింద వాళ్ళు హ్యాపీ అయ్యేలా సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నాగ్ అశ్విన్ ద్వారానే క్లిక్కయ్యాడు. అతని మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం లో అతనికి మంచి రోల్ ఇచ్చి ఒక లైఫ్ ఇచ్చాడు. ఇక విజయ్ కల్కి లో నటించేందుకు మొదట రెమ్యునరేషన్ ఏమి వద్దు అన్నారట. కానీ అది కరెక్ట్ కాదు అని నిర్మాత ఒక పేమెంట్ ఇచ్చారట.

ఇక రాజమౌళికి పేమెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా  ఆయన అశ్విని దత్ పైన గౌరవంతో ఎలాంటి పేమెంట్ తీసుకోలేదని తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ కూడా ఒకరోజు అలా సెట్స్ లోకి వచ్చి ఫ్రీగా నటించి వెళ్లినట్లు తెలుస్తోంది. దాదాపు గెస్ట్ పాత్రలన్నీ కూడా ఎలాంటి పేమెంట్స్ లేకుండానే  నడిపించేసారని  చిత్ర యూనిట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు  చెబుతున్నారు. ఇంత పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే ఎవరు మాత్రం పేమెంట్ గురించి ఆలోచిస్తారు. 

Post a Comment

Previous Post Next Post