మోక్షజ్ఞ తేజ.. ఈ వయసులో ఎంట్రీ అంటే..


మోక్షజ్ఞ తేజ త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చాలా రోజులుగా అనేక రకాల వార్తలు మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక అప్పుడప్పుడు మోక్షజ్ఞతేజ ఫొటోలు లీక్ అయ్యేదాన్ని బట్టి అతను ఇండస్ట్రీలోకి వస్తాడా లేదా అనే విషయంలో మరి కొన్ని గాసిప్స్ అయితే వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్ గా మోక్షజ్ఞ స్టైలిష్ గా ఉన్న మరికొన్ని ఫోటోలు చూస్తే అతను దాదాపు సిద్ధమైనట్లే అనే ఒక క్లారిటీ అయితే వస్తోంది.


మోక్షజ్ఞ వయసు ఇప్పుడు 29. సెప్టెంబర్ 6 వస్తే అతను 30 వసంతంలోకి అడుగుపెడతాడు. అయితే ఒక అగ్ర హీరో ఫ్యామిలీ నుంచి చాలా లేటుగా వస్తున్న ఏకైక హీరో నందమూరి మోక్షజ్ఞ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న అందరూ కూడా పాతికేళ్ల వయసులోపే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ సరైన స్క్రిప్ట్ లభించకపోవడంతో బాలయ్య బాబు మొదటి ప్రాజెక్టును హోల్డ్ లో పెడుతూ వచ్చాడు.

ఇక 30 ఏళ్ళ వయసులో ఎంట్రీ అంటే మొదటి సినిమానే చాలా గ్రాండ్ గా ఉండాలి. అతను ఒక ఐదేళ్ళ ముందే ఎంట్రీ ఇచ్చి ఉంటే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పుడు మూడు పదుల వయసులో మోక్షజ్ఞ పక్కా హిట్టు బొమ్మతో ఎంట్రీ ఇవ్వాలి. హీరోగా అనుభవం కూడా అతను వీలైనంత తొందరగా సంపాదించుకుంటేనే 40లోకి వచ్చే సరికి ఎన్టీఆర్ రేంజ్ లో క్రేజ్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక మొత్తానికి ఇప్పుడు అతను ఫిట్నెస్ గా కూడా పర్ఫెక్ట్ గా సిద్ధం కావడంతో స్క్రిప్ట్ చర్చల్లో బాలయ్య బాబు కూడా నిమగ్నమైనట్లు తెలుస్తోంది. వారసుడు మొదటి ప్రాజెక్టుపై ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట  మరి అతని మొదటి సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post