నాగ్ అశ్విన్, ఈ విషయంలో రాజమౌళి కంటే గ్రేటే..


కల్కి 2898ఏడీ సినిమా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణను పొందుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్-ఇండియా మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ విజయం వెనుక నాగ్ అశ్విన్ విశేషమైన కృషి, సృజనాత్మకత ప్రత్యేకంగా నిలిచాయి. కేవలం మూడు సినిమాలతోనే నాగ్ అశ్విన్ తనదైన ముద్ర వేశాడు.


మొదటి రెండు సినిమాలు అయిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' 'మహానటి'లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాయి. 'మహానటి' తో సావిత్రి జీవితాన్ని స్ఫూర్తిగా చూపిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందిన అశ్విన్, ఇప్పుడు కల్కి 2898ఏడీ తో మరింత ఎత్తుకు ఎదిగాడు. కల్కి 2898ఏడీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకునే వంటి స్టార్ నటులను స్క్రీన్ పై కుదించి, వారికి సరైన ప్రాముఖ్యత ఇచ్చాడు.

ఈ ప్రాజెక్ట్ కు భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకొచ్చిన అశ్వినీ దత్ కి కూడా అశ్విన్ తన క్రెడిట్ ఇచ్చాడు. "నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు సహకరించినందుకు అశ్వినీ దత్ గారికి, నటీనటులకు పూర్తి క్రెడిట్ చెందుతుంది" అని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. మూడో సినిమాతోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించడం సాధారణ విషయం కాదు. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడు తన సుదీర్ఘ ప్రయాణంలో పాన్-ఇండియా రేంజ్ కి చేరుకోగా, నాగ్ అశ్విన్ కేవలం మూడు సినిమాలతోనే ఆ స్థాయికి చేరుకున్నారు అని ఓ వర్గం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కల్కి లాంటి సినిమాను తెరపైకి తీసుకు రావడం గొప్ప విషయం. అందులోనూ రాజమౌళి ఎప్పటి నుంచో టచ్ చేయాలి అనుకున్న మహాభారతంను హైలెట్ చేయడం మరో గొప్ప మార్క్.

Post a Comment

Previous Post Next Post