రాజా సాబ్.. పరిస్థితి ఎలా ఉంది?


ప్రభాస్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, అతని ఇమేజ్ మాత్రం పెరుగుతూ వస్తోంది. "బాహుబలి" తర్వాత వచ్చిన "సాహో" దక్షిణాదిలో నిరాశ పరచినా, ఉత్తర భారతంలో మంచి విజయాన్ని అందుకుంది. "రాధే శ్యామ్" నిరాశ కలిగించినప్పటికీ, భారీ ఓపెనింగ్స్ సాధించింది. "ఆదిపురుష్" ట్రోలింగ్ బారిన పడినా వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. "సలార్" మిక్స్ టాక్ ఉన్నప్పటికీ, సూపర్ హిట్ అయ్యింది. తాజాగా "కల్కి 2898 ఏడి" ఆర్ఆర్ఆర్ రికార్డులను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది.


ప్రభాస్ నెక్స్ట్ సినిమా "ది రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య నిర్మించబడుతోంది. మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మారుతీ అద్భుతమైన స్క్రిప్ట్ తో ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. "కల్కి" విజయాన్ని చూసిన తర్వాత "రాజా సాబ్" మీదున్న అంచనాలు మరింత పెరిగాయి. "రాజా సాబ్" నిర్మాణ ఖర్చు "కల్కి" కంటే తక్కువ అయినప్పటికీ, బిజినెస్ పరంగా అదే స్థాయిలో ఉండబోతుంది.

ఉత్తరాది బయ్యర్లు కూడా పెద్ద ఎత్తున రేట్లు ఆఫర్ చేయడం జరుగుతోంది. ఇంకా విడుదల తేదీ నిర్ణయం తీసుకోకపోవడంతో డీల్స్ ఫైనలైజ్ కాలేదు. తక్కువ ఖర్చుతో నిర్మాతలు ఊహించని స్థాయిలో టేబుల్ ప్రాఫిట్ చూసే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడి మొత్తం ముందే వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ రెమ్యునరేషన్ పక్కన పెడితే సినిమా ఖర్చు 100 కోట్ల రేంజ్ లోనే ఉంటుందట. ఇక సినిమా అప్డేట్స్ వస్తే బజ్ మరింత పెరగవచ్చు. కాబట్టి మేకర్స్ తొందర పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2025 వేసవికి విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్లో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post