ఓజీ నుంచి న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పవన్ గిఫ్ట్


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఓజీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రతి అప్డేట్‌ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌లో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.

ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం, అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. న్యూ ఇయర్ సందడిలో ఈ సాంగ్ విడుదలతో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ఫీస్ట్ ఇవ్వాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు శింబు వాయిస్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాన్ గంభీర అలియాస్ ఓజీ అనే పవర్ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. 

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో పవన్‌కు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పవన్ ఇంకా హరిహర వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు చిత్రానికి క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

Post a Comment

Previous Post Next Post