పవర్ స్టార్ సినిమాకు ఏప్రిల్ గండం.. ఏదైనా జరగచ్చు!!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఒక సినిమా తరువాత మరో సినిమాను వీలైనంత స్పీడ్ గా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. అయితే ముందుగా వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో ఏప్రిల్ నెలలో 6 విడుదలవ్వగా అందులో మూడు హిట్టవ్వగా మరో మూడు ప్లాప్ అయ్యాయి. బద్రి (ఏప్రిల్ 20), ఖుషి (ఏప్రిల్ 26), జల్సా (ఏప్రిల్ 2) వంటి సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్లాప్ సినిమాల విషయానికి వస్తే.. జానీ(ఏప్రిల్ 25), తీన్ మార్(ఏప్రిల్ 14), సర్దార్ గబ్బర్ సింగ్(ఏప్రిల్ 8న) వంటి సినిమాలు అదే నెలలో వచ్చి డిజాస్టర్ అయ్యాయి.  మరి ఏప్రిల్ 9న వస్తున్న వకీల్ సాబ్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post