ఆ రెండు అయిపోయిన తరువాతే మెగాస్టార్ మూవీ


క్రాక్ సినిమాతో ఇటీవల దర్శకుడు గోపీచంద్ మలినేని బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం రబితేజకు మాత్రమే కాకుండా ఆ సినిమా గోపీచంద్ కు కూడా మంచి క్రేజ్ ను అంధించింది. ఇండస్ట్రీలో అతనికి ఇప్పుడు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. క్రాక్ సినిమాను బాలీవుడ్ కో రీమేక్ చేయాలని ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.


అయితే కమిట్మెంట్ ప్రకారం గోపీచంద్ మలినేని తెలుగులోనే నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న ఈ దర్శకుడు బాలకృష్ణ కోసం పవర్ఫుల్ కథను రెడీ చేసినట్లు చెప్పాడు. ఇక మెగాస్టార్ ను ఇటీవల ప్రత్యేకంగా కలుసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య సినిమా చేయాలనే చర్చలు కూడా జరిగాయట. నెక్స్ట్ బాలకృష్ణతో సినిమా చేసి అనంతరం క్రాక్ ను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నా గోపీచంద్ ఆ తరువాత మెగాస్టార్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.Post a Comment

Previous Post Next Post