స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప సినిమాతో భారీ స్థాయిలో హిట్ కొట్టాలని రెడీ అవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిమిస్తోంది. ఇక ఆ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా తరువాత బన్నీ కొరటాల శివతో ఒక పొలిటికల్ డ్రామాలో నటించనున్నాడు. అనంతరం ఆఫర్స్ చాలానే ఉన్నప్పటికీ బన్నీ ఇప్పుడే తొందర పడకూడదని అనుకుంటున్నాడు.
అయితే అందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందట. బన్నీ ఈ దర్శకుడితో ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కానీ వర్కౌట్ కావడం లేదు. ఇక కొరటాల శివ అనంతరం ఎలాగైనా ఆ దర్శకుడితో కాంబో సెట్ చేసుకోవాలని కొంతమంది నిర్మాతలు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే గౌతమ్ వాసుదేవ్ గతంలో మాదిరిగా అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా వండర్స్ క్రియేట్ చేయడం లేదు. ఒకవేళ అల్లు అర్జున్ తో సెట్టయితే అతని రేంజ్ కు తగ్గట్లు కమర్షియల్ సినిమా చేస్తాడో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment