ఉప్పెన డైరెక్టర్ మహేష్ సినిమాకు క్లాప్ కొట్టిన వేళ.. పిక్ వైరల్!!


సోషల్ మీడియాలో గత రెండు వారాల నుంచి ఉప్పెన సినిమా ట్యాగ్ ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ బుచ్చిబాబు గురించి కూడా ఇంటర్నెట్ లో సెర్చింగ్ లు చాలానే జరుగుతున్నాయి. మొదటి సినిమాను హైలెట్ చేయాలని దాదాపు టెలివిజన్ రంగంలో అన్ని ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు బుచ్చిబాబు. అవి కూడా వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ దగ్గర ఆర్య 2 నుంచి పని చేస్తున్నాడు. సహాయక దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేశాడు. ఇక వన్ నేనొక్కడినే సినిమాకు క్లాప్ కొట్టిన ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు బుచ్చిబాబు రైటర్ గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశాడు. ఒక షాట్ కోసం అలా క్లాప్ కొట్టగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది. హార్డ్ వర్క్ చేస్తే ఏనాటికైనా సక్సెస్ రాకుండా ఉండదని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఈ దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రెండు సినిమాలను చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు.Post a Comment

Previous Post Next Post