ప్రభాస్ టీమ్ తో బెల్లంకొండ శ్రీనివాస్!!


సీనియర్ ప్రొడ్యూసర్ బెల్లకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ నెక్స్ట్ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. రాక్షసుడు సినిమాతో అలా హిట్టు పడిందో లేదో ఏకంగా బాలీవుడ్ కు టెండర్ వేశాడు. వివి.వినాయక్ దర్శకత్వంలో ఎలాగైనా ఛత్రపతి సినిమాతో నార్త్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకోవాలని అడుగులు గట్టిగానే వేస్తున్నాడు. 

అయితే ఛత్రపతి రీమేక్ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్స్ తో మరో సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రొడ్యూసర్స్ మరెవరో కాదు ప్రభాస్ ప్రాణ స్నేహితులైన వంశీ ప్రమోద్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో బెల్లకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయడానికి కమిటైనట్లు తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడితోనే సినిమా ఉంటుందని టాక్ వస్తోంది. ఇక నెక్స్ట్ ఇయర్ ఛత్రపతి రీమేక్ అనంతరం టాలీవుడ్ లో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ రీమేక్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.



Post a Comment

Previous Post Next Post