రామ్ చరణ్ - శంకర్.. VFX, సెట్స్ అవసరం లేదట!


సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ మొదటిసారి తెలుగు హీరోతో వర్క్ చేయడానికి సిద్ధం కావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రామ్ చరణ్ RRR అనంతరం ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేస్తాడో అని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వచ్చిన అప్డేట్ అభిమానులకు మంచి కిక్కిచ్చింది. ఇక సినిమా ఏ జానర్ లో రానుందనేది టాక్ కూడా హాట్ టాపిక్ గా మారింది. 

నార్మల్ గా శంకర్ అంటే ఈ రోజుల్లో విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్ ఉంటాయనే ఆలోచన రాకుండా ఉండదు. అయితే రామ్ చరణ్ సినిమాలో మాత్రం అవేమి ఉండవట. సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే యాక్షన్స్ ఎపిసోడ్స్ మాత్రం శంకర్ రేంజ్ కు తగ్గట్టుకుగానే ఉంటాయని తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కబోయే ఈ పాన్ ఇండియా సినిమా కోసం మినిమమ్ 150కోట్ల బడ్జెట్ ఖర్చయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం చెన్నైలో బడ్జెట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.Post a Comment

Previous Post Next Post