ఉప్పెన అసలైన సీన్ మొత్తం లీక్ చేసేశారుగా..


టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఒక లవ్ స్టొరీ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా టీజర్ సాంగ్స్ ట్రైలర్ తోనే మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. కానీ ఉహీంచని విధంగా అసలైన క్లైమాక్స్ గురించి చాలా రోజుల నుంచి కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఫైనల్ గా సినిమా విడుదలైన కొన్ని గంటలకే ఆ సీన్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. 

హీరోను సంసారానికి పనికి రాకుండా చేసే ఆ సీన్ లో విజయ్ సేతుపతి హావభావాలు మరో లెవెల్లో ఉన్నాయి. చూస్తుంటే ఈ సీన్ మొత్తం వైరల్ అయ్యేలా ఉందని అర్ధమవుతోంది. ఒక విధంగా మంచి బజ్ కూడా క్రియేట్ చేయవచ్చు. అయితే సినిమాకు మొదటి షో నుంచి కూడా మిక్సీడ్ టాక్ వస్తోంది. అంచనాలను అందుకోలేదని కూడా అంటున్నారు. అయితే సినిమాలో వైష్ణవ్ నటన, హీరోయిన్ పెర్ఫెమెన్స్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. చూడాలి మరి సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుందో. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించింది.Post a Comment

Previous Post Next Post