మెగా స్టార్ కోరుకుంటే.. చరణ్ కు దక్కిన ఆఫర్


మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే ఏ దర్శకుడైన కూడా ఎగిరిగంతేయడం కామన్. చాలా వరకు మెగాస్టార్ దర్శకులను ఎంకరేజ్ చేస్తూ తన వైపు నుంచే ఆఫర్ వచ్చేలా చేస్తాడు. మంచి దర్శకులతో వర్క్ చేయడానికి ఏ మాత్రం మొహమాటం లేకుండా సినిమా చేద్దామని అనేస్తుంటారు. ఇక రోబో దర్శకుడు శంకర్ తో కూడా వర్క్ చేయాలని మెగాస్టార్ ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నారు.

ఆ మధ్య రోబో సినిమా ఈవెంట్ కు వెళ్లినప్పుడు శంకర్ తో వర్క్ చేయాలని ఉందని డైరెక్ట్ గా స్టేజ్ పైనే చెప్పేశాడు. అయితే ఆ తరువాత కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ అది నిజం కాలేదు. అయితే అప్పుడు మెగాస్టార్ కోరుకుంటే సక్సెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ అనుకోకుండానే శంకర్ తో వర్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. త్వరలోనే దిల్ రాజు ప్రొడక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు టాక్ అయితే వస్తోంది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ త్వరలోనే రావచ్చని సమాచారం.Post a Comment

Previous Post Next Post