Radhe Shyam Teaser Dialogues going Viral!!


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాహో డిజాస్టర్ అనంతరం ప్రభాస్ ఈ సినిమాతో ఎలాగైనా అభిమానులకు మళ్ళీ లవ్ స్టోరీతో సరికొత్త ఫీల్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇక రాధేశ్యామ్ టీజర్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు.

అయితే టీజర్ లో ప్రభాస్ విక్రమాదిత్య లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో కనిపించనుంది. వీరి మధ్య సాగే డైలాగ్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. 

"ప్రేరణ: నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నవా? 
విక్రమాదిత్య: ప్రేమ కోసం రోమియో చనిపోయాడు మనం అలా కాదు!.."

ఈ విధంగా రాధేశ్యామ్ టీజర్ తో ప్రభాస్ డైలాగ్స్ తో విజిల్స్ వేయించడం కాయమని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణంరాజు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక సినిమాను జులై 30న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post