మహేష్, రాజమౌళి మూవీ.. మొదలయ్యేది అప్పుడే!! || Mahesh-Rajamouli movie Update!!


దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాతో పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు. అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత రాజమౌళి మహేష్ బాబుతో బిజీ కానున్నట్లు ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. సాధారణంగా ఒక సినిమాను ఫినిష్ చేశాక కొంతకాలం వరకు గ్యాప్ తీసుకునే జక్కన్న ఈ సారి మాత్రం పెద్దగా గ్యాప్ తీసుకోడట.
అసలే లాక్ డౌన్ వలన ఏడాది కాలం వృధా అయ్యింది. ఇక RRR సినిమాను అక్టోబర్ లో విడుదల చేయగానే వెంటనే మహేష్ బాబుతో సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఆ సమయానికి మహేష్ బాబు కూడా తన సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసేసి రాజమౌళి కోసం రెడీగా ఉంటాడు. ఇక డిసెంబర్ లో సినిమా లాంచ్ ఈవెంట్ తో మొదలు పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీరి కాంబోలో వచ్చిన సినిమాను సీనియర్ నిర్మాత కెఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

Post a Comment

Previous Post Next Post