Tarun Bhaskar to work with this Star Hero finally??
Tuesday, February 02, 2021
0
పెళ్లి చూపులు సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అందుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండవ సినిమా ఈ నగరానికి ఏమైంది మూవీతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత నటుడిగా కొన్ని సినిమాలతో మెప్పించిన తరుణ్ డైరెక్షన్ కు కొంత గ్యాప్ ఇచ్చాడు. అతన్ని నటుడిగా కంటే కూడా ఆడియెన్స్ దర్శకుడిగానే ఎక్కువగా లైక్ చేస్తున్నారు.
అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇటీవల తరుణ్ భాస్కర్ ఒక సీనియర్ హీరోతో మళ్ళీ చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. కథపై ఆల్ మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నాలుగేళ్ళ నుంచి ఈ కాంబినేషన్ పై చర్చలు జరుగుతున్నాయి. ఇక మొత్తానికి కథ ఫైనల్ అవ్వడానికి రెడీగా ఉందట. వీలైనంత త్వరగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి వెంకీని ఈ దర్శకుడు ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. వెంకటేష్ నెక్స్ట్ నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Tags