జాంబీ రెడ్డి సీక్వెల్.. పాన్ ఇండియా లెవెల్లో..


ఎంత కొత్తగా ఆలోచిస్తే దర్శకులకు ఆడియెన్స్ కూడా అంత తొందరగా కనెక్ట్ అవుతారు అనేది మరోసారి ఋజువయ్యింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ అ!, కల్కి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా జాంబీ రెడ్డి కథతో మరోసారి ఆడియెన్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. మొత్తానికి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా మంచి ఓపెనింగ్స్ తో మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.  సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో తీస్తాడట. ఇప్పటికే కొన్ని రీమేక్ ఆఫర్స్ వచ్చినట్లు చెప్పిన ప్రశాంత్ ఈ సినిమా హిట్టయితే  తప్పకుండా సీక్వెల్ ను అగ్ర హీరోతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రజెంట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుందని అన్నాడు. అయితే సీక్వెల్ లో సమంత నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతూ సమంతతో వేరే కథ అనుకున్నట్లు వివరణ ఇచ్చాడు.Post a Comment

Previous Post Next Post