సినిమాల్లోకి దిల్ రాజు భార్య!!


టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఎదో ఒక విధంగా హైప్ క్రియేట్ చేయడం కామన్. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి నిర్మాత వరకు వచ్చిన ఆయన కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ ఉన్నాయి. కథల మీద మంచి జడ్జిమెంట్ ఉండడంతో హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు.

అయితే దిల్ రాజు టాలెంట్ కు ఆయన సతీమణి కూడా తొడయ్యింది ఇప్పుడు.  గత ఏడాది లాక్ డౌన్ లో దిల్ రాజు తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే తేజస్విని కథలు కూడా రాస్తోందట. ఆమెలో చిన్నప్పటి నుంచే రచయిత్రి భావాలు ఎక్కువగా ఉన్నాయట. తేజస్విని రాసిన ఒక నాలుగు కథల్లో దిల్ రాజుకు ఒక కథ బాగా నచ్చిందట. ఆ సినిమాను సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.Post a Comment

Previous Post Next Post