సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరని అందరికి తెలిసిన విషయమే. ఆయన ఎలాంటి సినిమా విడుదల చేసిన మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఇక ఆయన సంస్థలో ప్రస్తుతం బడా సినిమాలు రెడీ అవుతున్నాయి. అలాగే మిగతా సినిమాల బిజినెస్ లలో కూడా డిస్ట్రిబ్యూటర్ గా బాగమవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే KGF చాప్టర్ 2 తెలుగు హక్కులను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుపుతున్న దిల్ రాజు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాను దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర లో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. సింహా లెజెండ్ అనంతరం హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక సినిమాను తెలుగులో ప్లాన్ ప్రకారం విడుదల చేసి లాభాలు అందుకోవాలని డీల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment