టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్టవ్వాలని మాస్ రాజా ఏ రేంజ్ లో కోరుకున్నాడో గాని ఆయన అభిమానులు మాత్రం గట్టిగానే అనుకున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా 15కోట్లకు పైగా ప్రాఫిట్స్ ను అందించడంతో మాస్ రాజా రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది.
క్రాక్ సినిమా బాక్సాఫీస్ హిట్ అని మొదటి రోజు టాక్ రాగానే ఆఫర్స్ చాలానే వచ్చాయట. కానీ మాస్ రాజా వెంటనే ఒప్పేసుకోకుండా క్రాక్ క్లోజింగ్ కలెక్షన్స్ వరకు వేయిట్ చేశాడు. ఇక త్రినాథరావు నక్కినతో ఇటీవల ఒక సినిమాను చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు 14కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇంతకుముందు 8కోట్ల వరకే వచ్చిన మాస్ రాజా పారితోషికం ఇప్పుడు క్రాక్ హిట్టుతో డోస్ పెంచినట్లు టాక్. ఇంతకుముందు 10కోట్లు దాటాని మాస్ రాజా ఈసారి భారీ స్థాయిలో డిమాండ్ చేస్తుండడంతో మీడియం రేంజ్ నిర్మాతలు కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది
Follow @TBO_Updates
Post a Comment