RAPO.. What is Next??


ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యువ హీరో రామ్ పోతినేని ఇటీవల సంక్రాంతికి రేడ్ సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తడమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చి కొంత లాభాన్ని అయితే అందించింది గాని రామ్ ఊహించినంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

పొంగల్ రేస్ లో ఆ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందని హీరో చాలా నమ్మకం పెట్టుకున్నాడట. కానీ క్రెడిట్ అంతా రవితేజ క్రాక్ కు దక్కింది. అయితే రామ్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వీలైనంత వరకు ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ సినిమాతో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని ఒక ఆలోచనలో అయితే ఉన్నాడట. ఇక మొన్నటివరకు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ ఆయాన పవన్, ఎన్టీఆర్ అంటూ బిజీ అయిపోయారు. ఇక మధ్యలో మారుతితో చర్చలు జరిగినా వర్కౌట్ కాలేదు. స్టార్ దర్శకులు కూడా ఇప్పుడు ఎవరు ఖాళీగా లేరు. మరి రామ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post