Rajamouli, Sridevi వివాదంపై బోనీ కపూర్ హాట్ కామెంట్స్!!


సీనియర్ నిర్మాత శ్రీదేవి భర్త బోనీ కపూర్ రాజమౌళి పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. RRR రిలీజ్ డేట్ మైదాన్ డేట్ ఒకే సమయంలో పోటీగా దింపడం సరైనది కాదని ముందే చెప్పిన ఆయన శ్రీదేవిపై గతంలో చేసిన నెగిటివ్ కామెంట్స్ ను కూడా గుర్తు చేశారు. బాహుబలి సినిమాలో శ్రీదేవిని శివగామి పాత్రకు అనుకున్నప్పుడు ఆమెను సంప్రదించగా రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేశారని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.


అదే విషయాన్ని గుర్తు చేసిన బోనీ కపూర్.. అది నిజం కాదని, శ్రీదేవిని అన్ ప్రొఫెషినల్ అన్నారని కూడా తనకు తెలిసిందని, నిజానికి రాజమౌళే అన్‌ప్రొఫెషనల్ అని అన్నారు.  రెమ్యునరేషన్ ఆమె రేంజ్ కు తగ్గట్లు కాకుండా చాలా తక్కువగా చెప్పడమే రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణమని బోనీ కపూర్ తెలిపారు. అలాగే RRR రిలీజ్ డేట్ విషయంలో కూడా చర్చలు జరపడానికి ఇంట్రెస్ట్ చూపగా రిలీజ్ డేట్ తన చేతుల్లో లేదని అది నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయమని రాజమౌళి ఫోన్ లో చెప్పినట్లు బోనీ కపూర్ తెలిపారు. కానీ అలా ఎక్కడ జరగదని రాజమౌళి ఇలా ప్రవర్తించటం అనైతికం, వృత్తి విరుద్ధం. అలాంటి వారిపై నాకు గౌరవం ఉండదు. అని బోనీకపూర్ వివరించారు.


Post a Comment

Previous Post Next Post