మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్!!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న బన్నీ ఆ సినిమా తరువాత కొరటాల శివతో కొత్త సినిమాను స్టార్ట్ చేయడానికి ఒకే చెప్పాడు.  అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ లో వకీల్ సాబ్ డైరెక్టర్ తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు.

ఆ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ కూడా సెట్ చేశారు. ఇక రీసెంట్ గా బన్నీ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  ఆ దర్శకుడు మరెవరో కాదు. మహర్షి సినిమాను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి. ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమాను కూడా మహేష్ బాబుతోనే చేయాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక బన్నీకి తన కొత్త కథను వినిపించిన వంశీ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని సమాచారం. ప్రస్తుతం వంశీ ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడు.


Post a Comment

Previous Post Next Post