శంకర్ - చరణ్ మూవీ.. అలా సెట్టయ్యిందట!!


సంచలన దర్శకుడు శంకర్ మొదటిసారి తెలుగు హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. రామ్ చరణ్ తో నెవర్ బిఫోర్ అనేలా పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయిన శంకర్ కు దిల్ రాజు లాంటి తెలివైన నిర్మాత తొడయ్యాడు. ఇక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి  రెండేళ్లు పట్టవచ్చు. అయితే మొదట శంకర్ కొత్త సినిమాను రామ్ చరణ్ తో చేయాలని అనుకోలేదట.

బాహుబలి సినిమా చూసిన తరువాత ప్రభాస్ కు అభిమానిగా మారిన శంకర్ ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే దిల్ రాజుతో మాట్లాడి ప్రభాస్ డేట్స్ సెట్ చేయమని అడిగాడట. కానీ ప్రస్తుతం రెబల్ స్టార్ గ్యాప్ లేకుండా వరుసగా నాలుగు సినిమాలని లైన్ లో పెట్టాడు. శంకర్ తో సినిమా చేయాలి అంటే మరో రెండేళ్ల సమయం పట్టవచ్చని ప్రభాస్ చెప్పాడట. దీంతో అతన్ని కాదని మెగా పవర్ స్టార్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక RRRతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకోబోయే రామ్ చరణ్ అయితే బెటర్ అని దిల్ రాజు, శంకర్ ని ఒప్పించాడట. ఈ విధంగా ఈ బిగ్ కాంబినేషన్ సెట్టయినట్లు సమాచారం. మరి బాక్సాఫీస్ వద్ద  ఈ బడా ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం చేస్తుందో చూడాలి.Post a Comment

Previous Post Next Post