Ranga Ranga Vaibhavanga - Movie Review


కథ:
రిషి (వైష్ణవ్ తేజ్) రాధ (కేతిక శర్మ) చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బాగా తెలిసిన వారు. ఇక వారి ఫ్యామిలీస్ మధ్య మంచి స్నేహం ఉంటుంది. కానీ రిషి రాధ మాత్రం నిత్యం గొడవలు పడుతూ కాస్త ఈగో సమస్యలతో సీరియస్ గా ఉంటారు. ఇక మెడిసిన్ స్టూడెంట్స్ గా మారిన తరువాత ఆ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా చిగురించింది? ఊహించని క్రమంలో రాధ, రిషి ప్రేమ నుంచి ఎలా దగ్గరవుతారు?  సినిమా మొత్తం కథాంశం ఏమిటి? వారి కుటుంబాలు మరో సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మిగిలిన కథాంశం..

విశ్లేషణ:
ఇంతకుముందు దర్శకుడు గిరీషయ్ అర్జున్ రెడ్డి కథను తమిళంలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఉన్నది ఉన్నట్టుగానే అక్కడ తెరపైకి తీసుకురావడంతో అతనికి సరైన గుర్తింపు అయితే పెద్దగా రాలేదు. ఇక ఇప్పుడు సోలోగా తన సొంత కథతో సక్సెస్ అందుకోవాలి అని రంగ రంగ వైభవంగా.. అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక వైష్ణవ్ కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. అలాగే హీరోయిన్ కేతిక శర్మ కూడా మొదటి సక్సెస్ అందుకోవాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

దర్శకుడు గిరీషయా ఎంచుకున్న ఈ అసలు కథ కొత్తగా ఏమీ లేదు. గతంలో నువ్వే కావాలి ఫార్ములాతో చాలా సినిమాలు వచ్చాయి. ఇక దాదాపు అదే తరహాలో దర్శకుడు అసలు పాయింట్ తీసుకొని ఆ తర్వాత అందులోనే కొన్ని విభిన్నమైన అంశాలను హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇంటి పక్కనే ఉండే అమ్మాయి అబ్బాయి.. వారి మధ్య కోపం అహం.. వారి కుటుంబ సభ్యుల మధ్య మంచి స్నేహం.. ఇక అసలు వీరి మధ్య ప్రేమ అనేదే ఉండదు అని అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ప్రేమ చిగురించడం..  ఇక కుటుంబంలో మరికొన్ని సమస్యలు.. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడు ఊహించే విధంగానే ఉంటాయి.

కానీ కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను మాత్రం దర్శకుడు తనదైన శైలిలో హైలైట్ చేసి ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలు బాగున్నాయి ఫ్యామిలీ ఒడియన్స్ కు ఆ సన్నివేశాలు బాగా నచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ మూమెంట్స్ నుంచి లవ్ ట్రాక్ ఆ తరువాత రొమాన్స్ ఇక ఆ తరువాత మళ్ళీ మరికొంత కామెడీతో దర్శకుడు సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఎక్కువగానే హైలెట్ చేసినట్లు అనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ పాటలు కొంత వరకు పనిచేశాయి. కానీ ఎక్కువ భాగం వినోదాన్ని అందించడానికి పదే పదే ప్రయత్నాలు చేసినట్లు అనిపిస్తుంది. ఇక సీనియర్ ఆర్టిస్టులు నరేష్, ప్రగతి, ప్రభు, తులసి పాత్రలు కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ఇక మరికొన్ని డ్రామా సీన్స్ అయితే చప్పగా కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోమ్-కామ్ స్పేస్‌లో గతం నుండి వచ్చిన అనేక చిత్రాలను ఆడియెన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు.  చివరకు ఇంటర్వెల్ మార్క్ చుట్టూ కథలో చిన్న సంఘర్షణ తలెత్తుతుంది. ఇది బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ ఫస్ట్ అరగంట మరికొన్ని రొటీన్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి. చివరలో మళ్ళీ ఎదో కొత్తగా అనిపిస్తున్న భావన కలిగే లోపే మళ్ళీ రొటీన్ గానే ఎండ్ అవుతుంది. కమెడియన్ సత్య అక్కడక్కడా పరవాలేదు అనిపించాడు. ఇక మ్యూజిక్ సెకండ్ హాఫ్ లో పెద్దగా మ్యాజిక్ ఏమి క్రియేట్ చేసింది లేదు. కొన్ని విజువల్ రొమాంటి సీన్స్ పరవాలేదు. ఇక మొత్తంమీద, రంగా రంగ వైభవంగా పూర్తిగా ఊహించదగినది. ఏదేమైనా పెద్దగా అంచనాలు లేకుండా వెళితే.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ సినిమా ఆకట్టుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్:
👉ప్రొడక్షన్ వాల్యూస్ 
👉హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్

మైనస్ పాయింట్స్:
👉రెగ్యులర్ స్టోరీ
👉రొటీన్ సీన్స్
👉చిరాకు తెప్పించే కొన్ని కామెడీ సీన్స్

రేటింగ్2.25/5

Post a Comment

Previous Post Next Post