ఆ సినిమాల తరువాతే రాజా ది గ్రేట్ కాంబో?


టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంబినేషన్ అనే పదం వినిపిస్తే చాలు బాక్సాఫీస్ వద్ద ఎదో ఒక రికార్డ్ క్రియేట్ అవ్వడం కాయం. ఇక మాస్ మహారాజా ఇటీవల క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో ఇదివరకే ఆయనతో వర్క్ చేసిన దర్శకులు క్యూ కడుతున్నారు. క్రాక్ హిట్టవ్వడంతో రవితేజ రేంజ్ ఇప్పుడు ఒక్కసారిగా హై లెవెల్ కు చేరుకుంది.

ఇక ప్రస్తుతం మాస్ మహారాజా అనిల్ రావిపూడిని కూడా లైన్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదివరకే రాజా ది గ్రేట్ లాంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు మరో డిఫరెంట్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రావాలని అనుకుంటున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాతనే వీరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందట. ఇక ఆ లోపు అనిల్ రావిపూడి కూడా తన F3 సినిమాను ఫినిష్ చేసుకొని రవితేజ కోసం రేడీ కానున్నట్లు సమాచారం. మరి ఆ సినిమాలతో మాస్ రాజా ఇంకా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.Post a Comment

Previous Post Next Post