Subscribe Us

Shankar-Ramcharan-DilRaju Combo for a Mega Pan India Project!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్నన్నీ పాన్ ఇండియా సినిమాలు మరే ఇండస్ట్రీలో కూడా రావడం లేదు. ఇక  తమిళ్ దర్శకులు కూడా ఎక్కువగా తెలుగు హీరోలతోనే పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్  చూపిస్తుండడం విశేషం. ఇక త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ కూడా ఒక సినిమాను సెట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక వారి సినిమాను సీనియర్ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో శంకర్ దిల్ రాజు కాంబినేషన్ లో ఇండియన్ 2 రావాల్సింది. కానీ శంకర్ పెట్టిన బడ్జెట్ నెంబర్లకు భయపడిన దిల్ రాజు అప్పుడు డైరెక్ట్ గా నో చెప్పేశాడు. దీంతో లైకా ప్రొడక్షన్ ఆ సినిమాను సెట్స్ పైకి తెచ్చింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో శంకర్ ఒక హిస్టారికల్ కథపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ కథను పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. వచ్చే ఎడా ఈ సినిమా సెట్స్ పైకి రావచ్చని టాక్ వస్తోంది.



Post a Comment

0 Comments