ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసమే 6కోట్లా..?


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేసు. నిన్న విడుదలైన టీజర్ సినిమాపై బజ్ గట్టిగానే క్రియేట్ చేసింది. ఇక సినిమాలో ప్రభాస్ వేసుకున్న కాస్ట్యూమ్ చాలా కొత్తగా ఉంది. పిరియాడిక్ డ్రామాగా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక వింటేజ్ లుక్ లో కనిపించడం కోసం ఎవరు వాడని కాస్ట్యూమ్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారట. అందుకోసం భారీ స్థాయిలో డిజైనర్లను పిలిపించి డ్రెస్సులను కుట్టిస్తున్నారట. ఇక ఇప్పటివరకు కేవలం ప్రభాస్ బట్టల కోసమే 6కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ప్రభాస్ లుక్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు తోటపల్లి విజయభాస్కర్ వర్క్ చేస్తున్నాడు. అతను ఏక్ నిరంజన్ సినిమా నుంచి ప్రభాస్ సినిమాలకు వర్క్ చేస్తూ వస్తున్నాడు. ఇక రాధేశ్యామ్ లో కాస్ట్యూమ్స్ కోసం ముందుగానే ఆరు నెలలపాటు రీసెర్చ్ చేసి మరీ డ్రెస్ లను రెడీ చేయించినట్లు సమాచారం.Post a Comment

Previous Post Next Post