కొరటాల సినిమాలో మరోసారి మోహన్ లాల్!!


మళయాళం కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న నటుడు మోహన్ లాల్. ఇక జనతా గ్యారేజ్ సినిమా ద్వారా చాలా ఏళ్ళ అనంతరం తెలుగు సినిమాలో కనిపించిన ఆయన మరోసారి ఒక బిగ్ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల మరోసారి ఆయనను పవర్ఫుల్ పాత్రలో చూపించడానికి రెడీ అయినట్లు సమాచారం.

ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనంతరం కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఆ సినిమా పొలిటికల్ అంశాలతో కూడిన ఒక యూత్ ఫుల్ అంశంపై కొనసాగుతుందట. అయితే అందులో పవర్ఫుల్ ముఖ్యమంత్రి పాత్ర కోసం మోహన్ లాల్ అయితే బావుంటుందని దర్శకుడు ఆలోచించినట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే
.


Post a Comment

Previous Post Next Post