Uppena Heroine Hits Jackpot!!


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి హాట్ టాపిక్ గా మారింది. ఉప్పెన ఫస్ట్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతోంది. ఉప్పెన ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పుడే వరుస అవకాశాలను అందుకుంటోంది. ఇక సినిమా విడుదల అయ్యాక అమ్మడి హవా ఇంకా ఎక్కువయ్యేలా ఉందని అర్ధమవుతోంది.

నాని శ్యామ్ సింగరాయ్ అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటి సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినట్లు ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చేసింది. ఇక మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో కృతి మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటులను డేట్స్ పూర్తిగా సెట్టయిన అనంతరం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.



Post a Comment

Previous Post Next Post