మహేష్ బాబుతో లాభం లేదని.. పవన్ తో మరో ప్లాన్!!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ దొరికింది అంటే ఏ దర్శకుడు కూడా అంత ఈజీగా వదులుకోడు. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి ఏ క్షణాన మహేష్ బాబుకి బాగా కనెక్ట్ అయ్యాడో గాని మహర్షి సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా స్క్రిప్ట్ కోసం వంశీ దాదాపు మూడేళ్ళకు పైగా హార్డ్ వర్క్ చేసి మహేష్ డేట్స్ దొరికే వరకు వేయిట్ చేశాడు.

అయితే సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే క్లిక్కవ్వలేదు. కేవలం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చింది అంతే. ఇక ఆ తరువాత మహేష్ తో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ కు అతను రెండోసారి చెప్పిన కథ ఏ మాత్రం నచ్చలేదట. మరో కథ రెడీ చేయమని చెప్పాడు. కానీ మహేష్ నెక్స్ట్ కథను ఒకే చేసినా కూడా ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదట. సర్కారు వారి పాట అనంతరం జక్కన్నతో బిజీ కానున్నాడు. కాబట్టి వంశీ పవన్ కళ్యాణ్ వైపు ఫోకస్ పెట్టినట్లు టాక్. వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేసే కథ ఉంటే చెప్పాలని ఒక బడా నిర్మాత ఆఫర్ చేసినట్లు సమాచారం. మరి వంశీ పైడిపల్లి ఆ అవకాశాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.Post a Comment

Previous Post Next Post