విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా.. అడ్వాన్స్ ఇచ్చేశారట!!


కోలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులలో విజయ్ ఒకరు. తలపతిగా సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్న విజయ్ మార్కెట్ కూడా పెరుగుతూనే ఉంది. మినిమమ్ రెండు వందల కోట్లు అనేలా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. మాస్టర్ సినిమాతో తెలుగులో మార్కెట్ కూడా గట్టిగానే పెరిగింది.

అయితే ఈ స్టార్ హీరోకు తెలుగు నిర్మతల నుంచి అడ్వాన్స్ అందినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ విజయ్ తో డైరెక్ట్ తెలుగు తమిళ్ ద్విభాషా చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంసుకోసం విజయ్ కు వాళ్ళు 10కోట్ల వరకు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక మైత్రి సంస్థలో ప్రస్తుతం 10కి పైగా డిఫరెంట్ సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మార్కెట్ వాల్యును పెంచుకోవడానికి మైత్రి వారు విజయ్ డేట్స్ ను సాధించారని సమాచారం. ఇక నెక్స్ట్ విజయ్, నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత విజయ్ తెలుగు తమిళ్ లో డైరెక్ట్ గా ఒకేసారి సినిమా చేస్తాడని టాక్.Post a Comment

Previous Post Next Post