పుష్ప విలన్.. సేతుపతి ఇంకో ఛాన్స్ అంటున్నాడు?


ఇండియన్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకరైన విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగులో కూడా మంచి క్రేజ్ సెట్ చేసుకుంటున్నాడు. తమిళ్ లో ఇప్పటికే ఆల్ రౌండర్ గా అన్ని రకాల పాత్రలను చేస్తున్న సేతుపతి తెలుగులో కూడా అలానే బిజీ అవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా విలన్ గా మంచి క్రేజ్ అందుకున్న తరువాత సేతుపతి హీరోగా కూడా టాలీవుడ్ లో ఒక మార్కెట్ సెట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

అయితే ఇందుకుముందు విజయ్ సేతుపతి టాలీవుడ్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సైరా సినిమాలో మెగాస్టార్ కోసమే చేశాడు. ఇక ఆ తరువాత ఉప్పెన సినిమా చేయడానికి కూడా ఎంతగానో ఆలోచించి కథ విన్నాడు. ఇక అదే సమయంలో పుష్ప విలన్ ఆఫర్ రాగా బిజీగా ఉండడం వల్ల ఒప్పుకోలేదు. ఆ పాన్ సినిమాకు ఎలాగోలా డేట్స్ సెట్ చేసి ఉంటే మరో లెవెల్లో ఉండేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నాడ సేతుపతి. ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుకుమార్ సార్ ఇంకో ఛాన్స్ అనేశారు. అయితే ఇంకా పుష్ప విలన్ ఫైనల్ కాలేదు. మరి సుకుమార్ మళ్ళీ విజయ్ సేతుపతిపై దృష్టి పెడతారో లేదో చూడాలి..Post a Comment

Previous Post Next Post