Subscribe Us

Samantha's Pan India Movie Details!!


అక్కినేని వారి కోడలు సమంత ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇప్పుడు ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాల డోస్ ను పెంచుతున్నాయి. కమర్షియల్ సినిమాలను దూరం పెట్టేసిన సమంత వీలైనంత వరకు తన పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. ఆమె ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా కోసం సిద్ధమవుతోంది.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రాన్ని ప్రస్తుతం పాన్-ఇండియా ప్రాజెక్టుగా రూపొందింలాని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో సమంత హిందీ ఆడియెన్స్ కు దగ్గరవ్వనుంది. ఆ సిరీస్ తప్పకుండా క్లిక్కవుతుందని చెప్పవచ్చు. ఇక శాకుంతలం మేకర్స్ సమంత వెబ్ సిరీస్ కాస్త క్లిక్కయినా వారి ప్రాజెక్ట్‌ను పాన్-ఇండియా మూవీగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్‌లోని సెట్స్‌లో ఎక్కువగా చిత్రీకరించబడే ఈ చిత్రంలో ఈషా రెబ్బా కీలక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే.



Post a Comment

0 Comments