Subscribe Us

Prabhas Simply Rejects 100Cr Offer!!


రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇప్పుడు టాలీవుడ్ హీరో కాదు. పాన్ ఇండియా హీరో. దేశంలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న అతి తక్కువ మంది హీరోల్లో ప్రభాస్ ఒకరు. నేషన్ వైడ్ గా మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోకు తరచు బడా ప్రొడ్యూసర్స్ నుంచి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అయితే డార్లింగ్ మాత్రం కేవలం తనకు నచ్చిన సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

ఇటీవల బాలీవుడ్ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చిందట. వరుస బాక్సాఫీస్ హిట్స్ తో ఫామ్ లో కొనసాగుతున్న భాగి 3 నిర్మాత సాజిద్ నదియాద్వాలా ఇదివరకే ఒకసారి ప్రభాస్ ను కలిశాడు. అయితే మరోసారి యాక్షన్ కథను వినిపించగా సింపుల్ గా రిజెక్ట్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ప్రభాస్ 100కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక అంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా కాన్సెప్ట్ ఆడియెన్స్ అంచనాలను అందుకునేలా లేకపోతే ఏ మాత్రం అలాంటి సినిమాలను టచ్ చేయలేను అని వివరణ ఇచ్చాడట. గతంలో ధర్మ ప్రొడక్షన్ కరణ్ జోహార్ ఆఫర్ ను కూడా ప్రభాస్ ఇలానే రిజెక్ట్ చేశాడు.



Post a Comment

0 Comments