బాక్సాఫీస్ కు ఏడాది గ్యాప్ వచ్చిన దూరదృష్టమో ఏమో గాని ఈ ఏడాది మాత్రం మన తెలుగు సినిమాలు దానికి రెస్ట్ లేకుండా చేసేలా ఉన్నాయి. క్రాక్ సినిమా జనవరిలో డామినేట్ చేస్తే ఫిబ్రవరిలో ఉప్పెన మరో లెవెల్లో కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ జాతిరత్నాల వైపు మళ్లింది. నిజంగా చిత్ర యూనిట్ సభ్యులు టైమ్ చూసి సినిమాను వదులుతున్నాడు.
కరోనా కారణంగా అలసిపోయిన జీవితాలకు రియల్ ఎంటర్టైన్మెంట్ దొరికి చాలా కాలమయ్యింది. ఇక జాతిరత్నాలు తప్పకుండా కిక్కిస్తుందని ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నారు. గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. మాస్ ఏరియాల్లోనే కాకుండా మల్టీప్లెక్స్ లలో కూడా బుకింగ్స్ సాలీడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు చాలా ఏరియాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం పక్కా. చూస్తుంటే వీకెండ్ లోనే సినిమా పెట్టిన పెట్టుబడిని ఈజీగా వెనక్కి తెచ్చేలా ఉందని టాక్ వస్తోంది. మొదటి రోజే షేర్స్ అయితే ఈజీగా 4కోట్ల నుంచి 6కోట్ల మధ్యలో ఉండవచ్చని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Follow @TBO_Updates
Post a Comment