Another Akkineni Multi-Starrer Soon!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ మల్టీస్టారర్ సినిమాలు సెట్స్ పైకి వస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న బిగ్ స్టార్స్ అందరూ కూడా మరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి ఏ మాత్రం మొహమాటం పడటం లేదు. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ కథలకు ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అక్కినేని వారి నుంచి త్వరలోనే మరొక మల్టీస్టారర్ సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని నాగార్జున, అక్కినేని అఖిల్ కలిసి నటించబోతున్నాట. తెలుగులో లూసిఫర్ సినిమాను రీమేక్ చేయబోతున్న దర్శకుడు మోహన్ రాజా చెప్పిన ఒక కథ నాగార్జున బాగా నచ్చేసిందట. ఇక ఆ సినిమాలో అఖిల్ అక్కినేని కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మనం తరువాత అక్కినేని నుంచి మరో మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లు గత ఏడాది నుంచి టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే నాగ్ కొడుకుతో చేయనున్న కొత్త సినిమాపై అఫిషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.



Post a Comment

Previous Post Next Post