18 ఏనుగులు ఒకేసారి మీదకొచ్చాయి!!


టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి ఏం చేసినా కూడా విభిన్నంగా ఉంటుంది. అన్ని రకాల ఆడియెన్స్ కు నచ్చే విధంగా కథలను ఎంచుకునే రానా నెక్స్ట్ అరణ్య సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను అడవులల్లోనే ఎక్కువగా షూట్ చేశారు. ముఖ్యంగా రానా ఏనుగులతో చేసిన సీన్స్ అద్భుతంగా ఉంటాయట.

అయితే 18 ఎనుగులతో ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు అన్ని ఒకేసారి మీదకు వచ్చాయట. వెంటనే అలెర్ట్ అయినట్లు ఇటివల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. రానా మాట్లాడుతూ.. సాధారణంగా మనుషులకు అలవాటు పడిన ఏనుగులే అయినప్పటికీ మొదట్లో కొత్త వాళ్ళు కనిపిస్తే అంతగా ఈజీగా కనెక్ట్ కావు.

అందుకే వాటిని మొదట్లోనే తెలిసిన వ్యక్తిలా మచ్చిక చేసుకోవాలి. కానీ ఏనుగులను నమ్మడానికి వీలు లేదు. నేను షూటింగ్ సమయాల్లో వాటి కోసం జేబులో అరటిపండు బెల్లం ముక్కలు పెట్టుకునేవాడిని. అయితే ఒకరోజు జేబులో నుంచి సడన్ గా అరటిపండు కనిపించడంతో ఏనుగులన్ని నా దగ్గర అరటిపండ్లు చాలా ఉన్నాయని వచ్చాయి. అప్పుడు చాలా భయం వేసింది.. అని రానా వివరించాడు. 


Post a Comment

Previous Post Next Post