పొన్నంబళం.. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సీరియస్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడిని చూస్తే ఎవరైనా సరే ఈజీగా గుర్తుపడతారు. అయితే ఇప్పుడు మాత్రం అతని పరిస్థితి చాలా విషాధంగా మారింది. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆర్థిక పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదని మీడియాకు తెలియజేశారు.
చెన్నైలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్న పొన్నంబళంకు అవయవ మార్పిడి చేయనున్నారు. ఆపరేషన్ చేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరచ వచ్చని వైద్యులు సూచించారు. తన సోదరి కొడుకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, రాఘవ లారెన్స్ వంటి వారు సహాయం చేసినట్లు చెప్పారు. అలాగే మరికొందరు కూడా సహాయం చేస్తే
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవచ్చని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పొన్నంబళం సౌత్ ఇండియా యాక్టర్స్ ను అలాగే తెలుగు మా అసోసియేషన్ ను కూడా సహాయం చేయాలని కోరారు.
Follow @TBO_Updates
Follow @TBO_Updates